వరకట్న వేధింపులకు మహిళ ఆత్మహత్య?*
హైదరాబాద్ :ఆగస్ట్ 04
ఉప్పల్‌లో దారుణం చోటు చేసుకుంది. వరకట్న వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్‌తో సంధ్యారాణికి సంవత్సరం క్రితం వివాహం జరిగింది. పెద్దల సమక్షంలో పెళ్లి కోసమని, వరకట్నం కింద మూడు లక్షల పదివేలు క్యాష్ , పది తులాల బంగారం, ఫర్నిచర్ ఇచ్చారు. అయితే పెళ్ళికొడుకు ప్రవీణ్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడంతో పెళ్లయిన రెండు నెలలకే హైదరాబాద్ వచ్చి కాపురం పెట్టారు. కొద్దిరోజులు బాగానే ఉన్నారు.
అంతలోనే అదనంగా వరకట్నం కావాలని సంధ్య రాణిని వేధించడం మొదలు పెట్టాడు. ఈ విషయం అమ్మాయి తల్లికి చెప్పగా అదనంగా వరకట్నం ఇవ్వలేనని అల్లుడితో చెప్పింది. దీంతో ప్రవీణ్ తన భార్య పట్ల క్రూరంగా వ్యవహరించాడు. అతని వేధింపులు భరించలేక గురువారం అర్ధరాత్రి సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుంది.
విషయం తెలుసుకున్న సంధ్యారాణి తల్లి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు…
