ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు3, పోతుగల్ సహకార బ్యాంక్ అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు వారి అభివృద్ది కొరకు అనేక కార్యక్రమాలను చేపట్టిన సీఎం కేసీఆర్ రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రైతులకు 1,లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈకార్యక్రమంలో గ్రామసర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు, సింగిల్ విండో డైరెక్టర్ బాబురావు, వైస్ చైర్మన్ రాజేశం, ఎంపీపీ జనగామ శరత్ రావు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి తదితరులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు సీఎం మన అదృష్టం అంటూ కొనియాడారు, రైతుల కొరకు రైతుభీమా,రైతుబందు, ఏరాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన సంక్షేమ పథకాలు రైతులకు అవలంబించుటలో కెసిఆర్ ముందున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ విద్యా కమిటీ చైర్మన్ కస్తూరి శ్రీనివాస్ రెడ్డి, కట్టబాబురావు, దొమ్మ రవీందర్ రెడ్డి,
గంభీరావుపేట్ బాలయ్య, చిగురు నరేష్, కొండన్ బాలకిషన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.




