రైతులకు మేలు చేకూర్చే ప్రాజక్ట్ కొండ పోచమ్మ డ్యామ్ — ఎంపీపీ పాండు గౌడ్
రైతు పక్షపాతి సీఎం కెసిఆర్ నేతృత్వంలో కాళేశ్వరం తో కొండపోచమ్మ డ్యామ్ నిర్మాణం చేయడం ద్వారా రైతులు సంతోషంగా ఉన్నారని ఈ ప్రాంతంలో వ్యవసాయం పుంజుకుంది అని ఎంపీపీ పాండు గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బుదవారం ఎంపీపీ పాండు గౌడ్ తన వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా వ్యవసాయ పనులు చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు స్వయానా పార చేపట్టి వ్యవసాయ పనులు పూర్తి చేసిన ఎంపీపీ పాండు గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రపంచం నివ్వెర పోయే విధంగా రైతుల కోసం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించి రైతు భాందవుడుగా నిలుస్తున్నారని గతంలో రైతులు ఆత్మ హత్యలు చేసుకున్న సందర్బాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక రైతు ఆత్మ హత్యలు గణనీయంగా తగ్గాయి అని రైతును రాజుగా చేసే పనిలో సీఎం కెసిఆర్ ఉన్నారని ప్రతిపక్ష పార్టీలు ప్రజలను మభ్యపెడుతూ ఉన్నాయని ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మెస్తితిలో లేరని ప్రతిపక్ష పార్టీలు కేవలం మాటలకే పరిమితం అయ్యారు బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేకూర్చే ప్రభుత్వం అని ముచ్చటగా మూడోసారి సీఎం కెసిఆర్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు
