రాజన్న సిరిసిల్ల పట్టణంలో గల ఓ కాలువలో గుర్తుతెలియని మృతి దేహం మంగళవారం లభ్యమయింది. సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద మల్లికార్జున వైన్స్ పక్కన ఉన్న కాలువలో గుర్తుతెలియని సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వ్యక్తి మృతదేహం స్థానికులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించిఇతను ఎవరు…? కాలువలో ఎలా చనిపోయాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
