*ఈరోజు నూతన అడిషనల్ డీసీపీ (అడ్మిన్) గా బాధ్యతలు స్వీకరించిన అందె శ్రీనివాస్ రావు గారు*
నూతన అడిషనల్ డీసీపీ (అడ్మిన్) గా బాధ్యతలు స్వీకరించిన అందె శ్రీనివాసరావు గారు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ మేడం గారిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. కమిషనర్ మేడం గారు అడిషనల్ డీసీపీ అడ్మిన్ గా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందించారు.
అందె శ్రీనివాస రావు గారు 1991 బ్యాచ్ ఎస్ఐగా పోలీస్ డిపార్ట్మెంట్లో అరంగేట్రం చేశారు హైదరాబాద్ సిటీలో పనిచేశారు.
2005 సీఐగా ప్రమోషన్ పొంది హైదరాబాద్ ఓల్డ్ సిటీ మీరు చౌక్, హైదర్గూడా ట్రాఫిక్ తదితర విభాగాలలో పనిచేశారు.
2014 డీఎస్పీగా ప్రమోషన్ పొంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, మాదాపూర్ ట్రాఫిక్, పిటిసి అంబర్పేట్ మరియు హైదరాబాద్ సిటీలో పనిచేశారు.
2023 జూన్ లో అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ పొంది సిద్దిపేట అడిషనల్ డీసీపీ అడ్మిన్ గా ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టారు.
