గఢీలా పాలన అంతానికై బహుజన చైతన్య యాత్ర
– బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్
సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ మండలంలోని వివిధ గ్రామాలను చైతన్య పరుచటకై నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బహుజన చైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది. ఇట్టి బహుజన చైతన్య యాత్ర పిడిచేడ్ ,అహ్మదీపూర్ ,సింగాటం, భూర్గుపల్లి ,దాచారం తిరిగి గజ్వేల్ చేరుకుని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మహానీయలు సాకలి ఐలమ్మ, బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ ,భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళ్ళు అర్పించడం జరిగింది. అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ గారు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలోని గడప గడపలో స్ఫూర్తిని నింపేల బహుజన చైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది అన్నారు.అగ్రకుల కబంధ హస్తాల్లో బందీ ఐన బహుజనులు చైతన్యం అవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.నియోజకవర్గ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో బహుజన జెండా ఎగరవేయడం కోసమే ఈ బహుజన చైతన్య యాత్ర నిర్వహించడం జరిగిందని, గజ్వేల్ లో ఏనుగు జెండా ఎగురవేసి వరకు విశ్రమించమని అన్నారు. నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి కర్ణాకర్ గారు మాట్లాడుతూ గజ్వేల్ లో అగ్రకుల పార్టీలకు దీటుగా సమాధానం చెప్పడానికే ఈ బహుజన చైతన్య యాత్ర నిర్వహించడం జరిగిందని, బాహుజనులు సొంత గూటికి రావాలని అన్నారు. నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కానుగుల రమణాకర్ గారు మాట్లాడుతూ బహుజనులా అభివృద్దే ఈ దేశ అభివృద్ధి అని అన్నారు. ఎక్కడ బహుజనులు చైతన్యం అవుతారో అని BC, SC,మైనారిటీ బంధుల పేరిటా బంగారు పంజరంలో బందిస్తున్నారని మండి పడ్డారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు గుర్రం ఎల్లం గారు,కోశాధికారి మొండి కర్ణాకర్ గారు, మైనారిటీ కన్వీనర్ MD. అఖిల్ పాషా గారు , EC మెంబెర్ కనకప్రసాద్ గారు, కెత్తోజి వినోద్ గారు ,వివిధ మండలాల అధ్యక్షులు, గ్రామ ,బూత్ అధ్యక్షులు కార్యకర్తలు భారీ ఎత్తున్న పాల్గొన్నారు.





