*ట్రాక్టర్ మీద నుంచి వెళ్లిన బ్రతికిండు.*
ఎర్రుపాలెం మండల కేంద్రంలో బుధవారం ఉదయం ఓ వ్యక్తిపై నుండి ట్రాక్టర్ వెళ్లిన ఘటన లో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్లు డీజిల్ వేయించుకునేందుకు వచ్చిన ఎన్టీఆర్ జిల్లా కు చెందిన కృష్ణారెడ్డి ట్రాక్టర్ పై నుండి క్రిందికి దిగి తన లుంగీని సరి చేసుకునే సందర్భంలో న్యూట్రల్ లో ఉన్న ట్రాక్టర్ గేర్ లో పడటంతో అతని పైనుండి వెళ్ళింది, గమనించిన బంకు సిబ్బంది టాక్టర్ వెంబడించి బ్రేకులు వేసి చౌకు ఆపడంతో మరో ప్రమాదం జరగకుండా నిలువరించారు, క్షతగాత్రున్ని 108 ద్వారా హాస్పటల్ కు తరలించారు.
