Breaking News

బబ్బూరి రాందాస్ గౌడ్ సేవలు అభినందనీయం — ఎమ్మెల్సీ యాదవరెడ్డి

71 Views

మన ఊరు మన బడి వచ్చిన తర్వాత ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో మంగళవారం నాడు స్థానిక ప్రాథమిక పాఠశాలలో వంటిమామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బబ్బురి రామ్ దాస్ గౌడ్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఇంగ్లీష్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి,జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం,వైస్ ఎంపీపీ మంద బాల రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి,సర్పంచ్ అశోక్ పాల్గొని వారు మాట్లాడుతూ అన్ని దానాల కన్న విద్యా దానం గొప్పదని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్ పుస్తకాలు పంపిణీ చేస్తున్న రామ్ దాస్ గౌడ్ కు అభినందనలు తెలిపారు సీఎం కెసిఆర్ మనబడి మన ఊరు కార్యక్రమం తీసుకువచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తున్నారని, చెబర్తి లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్య ను అందజేస్తున్న పాఠశాలల ఉపాధ్యాయ బృందం కు శుభాభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ స్వామి , వంటి మామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాందాస్ గౌడ్, ప్రవీణ్ చారి,ఆత్మ కమిటీ డైరెక్టర్ సంతోష్,గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు గ్యార మల్లేష్,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు, స్వెరో చిన్ని కృష్ణ,నాయకులు జయరామ్,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Pitla Swamy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *