Breaking News

క్షేత్ర ప్రదర్శన

155 Views

అధిక సాంద్రత ప్రత్తి సాగులో క్షేత్ర ప్రదర్శన

మార్కుక్ అక్టోబర్ 17

అధిక సాంద్రత పద్ధతిలో లో పత్తి సాగు చేయడం వలన దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని భారత దేశ ప్రత్తి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా. రాజా తెలిజేశారు

ఇందులో భాగంగా ఈ పద్ధతి ద్వారా సిద్దిపేట జిల్లామార్కుక్ మండలం చేబర్తి గ్రామంలో సాగు చేస్తున్న స్థానిక సర్పంచ్ ఎర్రబాగు అశోక్ పొలంలో క్షేత్ర ప్రదర్శన ఏర్పాటుచేయడం జరిగింది. ప్రస్తుతం పెరుగుతున్న కూలీల కొరత అధిగమించాలంటే విత్తనం విత్తినప్పటి నుండి పత్తి తీతవరకు యాంత్రికరణ కావలసిన అవసరం ఉందని తెలియజేశారు.

ఈ పద్ధతిలోని వంగడాలు పంట కాలం తక్కువగా ఉండటం వల్ల కాయలు మరియు పూత తొందరగా మరియు 20 నుండి 30 వరకు వస్తున్నాయి. మొక్కలు ఏపుగా పెరగకుండా మేపిక్వాట్ క్లోరైడ్ అనే మందును పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఈ పధ్ధతి సాగు చేస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అని తెలిజేశారు. మండల వ్యవసాయ అధికారి టి.నాగేందర్ రెడ్డి ఎకరాకు 50 కేజీ ల యూరియా 25 కిలోల పోటాష్ ఎరువులను వేసుకోవాలని సూచించారు.

సాధారణంగా హైబ్రిడ్ వంగడాలను రైతులు ఎకరానికి 4938 మొక్కల నుండి 7407 మొక్కల సంఖ్య ఉండటం వలన మొక్కలు బాగా పెరగడం పెరగడం, పంటకాలం పెరగడం, తద్వారా గులాబి రంగు పురుగు ఉధృతి ఎక్కువ కావడం వలన ఆశించిన మేరకు రావడం లేదు. మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన తొందరగా నేలను ఆవరించి కలుపు సమస్య తగ్గుతుందని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ రవి కుమార్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఈ పద్ధతిలో పురుగుల యాజమాన్యం తప్పనిసరిగా చేపట్టాలని బెట్ట పరిస్థితులలో నీటిలో కరిగే ఎరువులను పిచికారి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రాశి కంపెనీ ప్రతినిధులు మనోజ్ , బలరాం గ్రొమోర్ ప్రతినిధులు,

వ్యవసాయ విస్తరణ అధికారి రజినీ కాంత్ , ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్, రైతు సమన్వయ కమిటీ జాలని బ్యానర్సయ్య,తోట ఆంజనేయులు,రైతులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *