రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో స్వర్ణకార సంఘాలను బలోపేతం చేయాలి…..
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో రాచర్ల తిమ్మాపూర్ స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి అధ్యక్షునిగా శ్రీపాద లింగమూర్తి చారి ఉపాధ్యక్షునిగా నల్లనాగుల ప్రశాంత్ చారి కార్యదర్శిగా శ్రీపాద నరేష్ చారి ఉప కార్యదర్శిగా నల్లనాగుల రాజు చారి కోశాధికారిగా నల్లనాగుల వెంకట్ నర్సయ్య చారి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇట్టి కార్యక్రమానికి ఎల్లారెడ్డిపేట మండల విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ప్రధాన కార్యదర్శి వంగల వసంత్ కుమార్ విచ్చేసి ఎన్నికలను సజావుగా జరిపారు వంగాల వసంత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కానీ జిల్లాలలో కానీ మండలాలలో ప్రతి గ్రామానికి స్వర్ణకార సంఘం ఏర్పాటు చేసి మనం మన బలాన్ని ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వం నుండి వచ్చే నిధులను మనం సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ సంఘ సభ్యులు కలిసి ఉంటేనే మన బలం ప్రజాప్రతినిధులకు గాని అధికారులకు కానీ తెలుస్తుందని మనం కలిసి లేకుంటే మనం ఐక్యంగా ఉన్నామని మనపై ఎవరైనా చిన్న చూపు చూడటానికి కూడా భయపడతారని అన్నారు మన హక్కుల సాధనకై తప్పక ప్రతి ఒక్క స్వర్ణకారుడు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు దుంపటి కృష్ణమూర్తి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీరామోజు దేవరాజు చారి రాచర్ల తిమ్మాపూర్ స్వర్ణకార సంఘ సభ్యులు పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించుకున్నారు
