(శంకరపట్నం పిబ్రవరి )
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ మహిళ ఆత్మ హత్యాయత్నం చేసింది
వివరాల్లోకి వెళితే పూస శివకుమారి కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసి గ్రామపంచాయతీ కార్యదర్శి కీ ఆన్లైన్ ఫామ్స్ ఇచ్చి ఇల్లు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరితే పంచాయతీ కార్యదర్శి మమత ఇల్లు పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని వెంటనే పర్మిషన్ కావాలంటే 20వేల రూపాయలు ముట్ట చెప్పాల్సిందే అని లేకుంటే ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని కరాకండిగా చెప్పారని బాధితురాలు వాపోయింది….
ఇల్లు పర్మిషన్ ఇవ్వకుండా కార్యదర్శి మమత వేధిస్తుందని ఆర్థికంగా అంతా ఇచ్చుకోలేమని చెప్పిన వినకుండా ఇల్లు పర్మిషన్ దాటవేస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఒంటిపై పెట్రోల్ , పోసుకొని ఆత్మహత్య యత్నానికి ఒడీ కట్టానని చెప్పింది…
దీనిపై కార్యదర్శి మమతను వివరణ అడగగా
ప్రత్యేక అధికారుల పాలన , ప్రారంభం కావడంతో పని ఒత్తిడి వల్ల ఇల్లు , పర్మిషన్ ఇవ్వడంలో ఆలస్యమైందని అంతేకాకుండా వారు దరఖాస్తు చేసిన భూమి గ్రామ కంఠంలో ఉంది కాబట్టి ఎమ్మార్వో సలహా మేరకు పర్మిషన్ ఇస్తామని ఇందులో తన తప్పు ఏమి లేదని తెలిపింది..




