హైదరాబాద్ మార్చి 20, 27/ తెలుగు న్యూస్ :సాగు భూముల సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్ లో జరిగే “భూ సదస్సు”ను జయప్రదం చేయండి.తెలంగాణ రైతాంగ సమితి.
హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏకశిలా పార్కు దగ్గర నిరసన జరిగింది. భూ సమస్యల సాధన సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ పార్కు దగ్గర ఆందోళన కార్యక్రమం లో మాట్లాడుతూ రాష్ట్రంలో పోడు భూములకు 12 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి కేవలం నాలుగు లక్షల ఇచ్చి 8 లక్షల ఎకరాలకు పత్రాలు ఇవ్వలేదు పోడు భూములు సాగు చేస్తున్న రైతు దరఖాస్తుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
ఇదే రకంగా నూతన ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగే సదస్సును జయప్రదం చేయాలనీ నినాదాలు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ హరగోపాల్, వ్యవసాయ ప్రొఫెసర్ అల్తాఫ్ జానయ్య, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, రైతు స్వరాజ్య వేదిక కన్నెగంటి రవి పాల్గొంటారు. భూ సమస్యల పరిష్కార సదస్సును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కరపత్రాల విడుదల కార్యక్రమంలో తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వెంకటయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేందర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇంద్రసేన, రైతాంగ సమితి జిల్లా కన్వీనర్ గణేష్, జిల్లా నాయకులు బాబన్న, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.