*పోషణ భారమై…పిల్లలను నిద్రపుచ్చి. తల్లి ఆత్మహత్య*
హైదరాబాద్ ఫిలింనగర్ లో విషాదం చోటుచేసుకుంది.
మహత్మాగాంధీ నగర్ బస్తీకి చెందిన నందిని(23) భర్త మంజునాథ్ జనవరిలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించాడు.
దీంతో నందిని భిక్షాటన చేస్తూ పిల్లలు మణికంఠ(3), సాయి(1)లను పోషిస్తోంది.
అయితే, అత్తింటివారు పట్టించుకోకపోవడం, గొడవలు, ఆర్థిక ఇబ్బందులతో ఆమె ఆదివారం రాత్రి పిల్లలను నిద్రపుచ్చి, వారి పక్కనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
దీంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
