నిరుపేద కుటుంబానికి పుస్తె మట్టలు అందజేసిన టిఎస్ఎన్ ట్రస్ట్ అధినేత తుమ్మ గణేష్
వర్గల్ మండల్, చౌదర్పల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గుడ్డోజి వెంకటలక్ష్మి-గురువు దంపతుల కుమార్తె భాగ్యలక్ష్మి వివాహానికి పుస్తేమట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారికి చేసే సహాయంలో ఉన్న సంతృప్తి మరెందులో లేదన్నారు. నిరుపేద వధువుకు పుస్తేమట్టెలు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో లింగ రవి మానుక ఎల్లం గౌడ్ కీసర శివయ్య తదితరులు పాల్గొన్నారు.