తెలంగాణ రక్షణ సమితి గజ్వేల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గా అక్బర్
అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా తెలంగాణ రక్షణ సమితి పనిచేస్తుందని తెలంగాణ రక్షణ సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సిలివేరి ఇంద్రగౌడ్ అన్నారు ఆదివారం ప్రజ్ఞపూర్ హరిత హోటల్ వద్ద గజ్వేల్ కి చెందిన యువకులు తెలంగాణ రక్షణ సమితి లో చేరిన సందర్భంగా వాటికి తెలంగాణ రక్షణ సమితి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా యువ నాయకుడు అక్బర్ కు తెలంగాణ రక్షణ సమితి మైనార్టీ సెల్ అధ్యక్షుడు గా బాధ్యతలు అప్పజెప్పారు ఈ సందర్భంగా అక్బర్ మాట్లాడుతూ నాకు తెలంగాణ రక్షణ సమితి గజ్వేల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గా పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి తెలంగాణ రక్షణ సమితి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో నిరంజన్,నవీన్,నరేందర్ తదితరులు పాల్గొన్నారు
