*రేపు సెలవుపై మధ్యాహ్నం ప్రకటన?*
TS: విద్యా సంస్థలకు ప్రకటించిన సెలవులు నేటితో ముగియనున్నాయి. రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి. అయితే సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. మరోవైపు వేలాది స్కూళ్లలో బురద పోలేదు. దీంతో రేపు సెలవు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం సెలవుపై ఈ మధ్యాహ్నం ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.





