*తాజాగా 50 వేల మందికి రైతుబంధు జమ*
*వానకాలం రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది*.
*ఇటీవల పలు సాంకేతిక సమస్యలతో కొన్ని రోజులపాటు నిలిచిపోయిన పంపిణీ గత మూడు రోజుల నుంచి మళ్లీ మొదలైంది*.
*హైదరాబాద్: వానకాలం రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. ఇటీవల పలు సాంకేతిక సమస్యలతో కొన్ని రోజులపాటు నిలిచిపోయిన పంపిణీ గత మూడు రోజుల నుంచి మళ్లీ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 49,990 మంది రైతుల ఖాతాల్లో రూ.136.54 కోట్లు జమ చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 1.13 కోట్ల ఎకరాలకుగాను 63.34 లక్షల మంది రైతుల ఖాతాల్లో 5,694.90 కోట్లను ప్రభుత్వం జమ చేసినైట్టెంది.*
