Breaking News

Tomato: మదనపల్లె మార్కెట్‌లో టమాటా రికార్డు మోత.. కిలో రూ.196

116 Views

Tomato: మదనపల్లె మార్కెట్‌లో టమాటా రికార్డు మోత.. కిలో రూ.196

 

మదనపల్లె : అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధర రికార్డు మోత మోగింది. శనివారం కిలో నాణ్యమైన టమాటా రూ.196 పలికింది. అత్యల్పంగా కిలో రూ.140 ధరను నమోదు చేసింది..

దీంతో వినియోగదారుల్లో గుబులు మొదలైంది.

మదనపల్లె మార్కెట్‌కు శనివారం కేవలం 253 టన్నుల సరకు మాత్రమే వచ్చింది. బయట ప్రాంతాల్లో దిగుబడి లేకపోవడం, మదనపల్లె ప్రాంతంలో సీజన్‌ చివరి దశ కావడం వంటి కారణాలతో ధరలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయని వ్యాపారులు, అధికారులు చెబుతున్నారు. మదనపల్లె మార్కెట్‌లో మొదటి రకం కిలో టమాటా రూ. 160 – రూ. 196, రెండవ రకం రూ.120 – రూ.156 వరకు పలికింది. 25 కేజీల బుట్ట ధర రూ.4500 – రూ 4900తో వ్యాపారులు కొనుగోలు చేశారు..

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *