ఫోటో చిత్రం)
హెడ్ పోస్టాఫీసు ఎదుట ఊడి పోయి (ఉన్నపోస్ట్ బాక్స్ కింది భాగం
పోస్ట్ మాస్టర్ నిర్లక్ష్యానికి రక్షణ లేని పోస్ట్ బాక్సే నిదర్శనం…:
ఎల్లారెడ్డిపేట హెడ్ పోస్టాఫీసు ఎదుట గోడకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన పోస్ట్ బాక్స్ కింది భాగం ఊడి పోయి ఉంది,
ఊడి పోయి ఉన్న పోస్టు బాక్స్ ను
పోస్ట్ మాస్టర్ ఎందుకు ఏర్పాటు చేశాడో ఆయనకే తెలియాలి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్లా ఉద్యోగ బాధ్యత అంటే ఇదేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు, ఎల్లారెడ్డిపేట హెడ్ పోస్టాఫీసు పరిస్థితే ఇట్లుంటే వివిధ గ్రామాల్లో అసలు పోస్ట్ బాక్స్ లున్నాయా ఉంటే వాటి పరిస్థితులేమిటోనని వారు ఆందోళన వ్యక్తం చేశారు,
ఎల్లారెడ్డిపేట హెడ్ పోస్టాఫీసు ఎదుట గోడకు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన పోస్టు బాక్స్ లో ఎల్లారెడ్డిపేట మండల జర్నలిస్టులు పోస్ట్ కార్డు ఉద్యమం లో భాగంగా పోస్ట్ కార్డు లు శుక్రవారం వేయడానికి రాగా పోస్ట్ బాక్స్ కింది భాగం ఊడి పోయి పోస్ట్ కార్డు లన్ని శ్రీ మార్కండేయ స్వామి సాక్షి గా వివిధ వార్తలను వెలికి తీసే విలేకరుల సాక్షి గా నేలపై పడ్డాయి , ఇదేమిటని పోస్ట్ మాస్టర్ ను ప్రశ్నించగా అది పాడైపోయిందని అది బాగు చేయిస్తామని వార్త రాయకండని పోస్ట్ మాస్టర్ తో పాటు అక్కడున్న పోస్టల్ డిపార్ట్మెంట్ కు చెందిన సిబ్బంది ప్రాధేయపడ్డారు పోస్ట్ బాక్స్ కింది భాగం ఊడి పోయి ఉంటే పోస్ట్ కార్డు లు ఇంగ్లాండ్ లెటర్స్ , వివిధ పారిస్సిల్లు అందులో వేస్తే వారి పరిస్థితి ఏమిటీ
ఇప్పటికైనా పోస్టల్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారులు జిల్లాలో పాడైపోయిన పోస్ట్ బాక్స్ లను బాగుచేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
