పత్తి ఏరుతూ గుండెపోటుతో యువరైతు మృతి…
ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన యువ పత్తి రైతు పెరుమాండ్ల నరేష్ గురువారం తన పత్తి చేనులో పత్తి ఏరుతూ గుండెపోటుతో మరణించాడు. నరేష్ అతని భార్య లత లు కలిసి పత్తి చేర్చుతుందగ గుండెనొప్పి వచ్చింది వెంటనే అతన్ని అతని భార్య ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అక్కడ డాక్టర్లు పరీక్షించి గుండెపోటుతో మరణించినట్లు వారు దృవీకరించారు, నరేష్ కు భార్య లత కూతురు అర్చిక (12 ) కుమారుడు హర్షవర్ధన్ (15 ) వున్నారు ,. యువ పత్తి రైతు నరేష్ పత్తి చేనులో పత్తి ఏరుతూ గుండెపోటుతో మరణించినందున ప్రభుత్వం నరేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ కదిరే రజిత శ్రీనివాస్ గౌడ్ , మండల వైస్ ప్రెసిడెంట్ కదిరే భాస్కర్ గౌడ్ ,భారతీయ కిసాన్ సంఘ ప్రతినిధి ద్యాప దేవయ్య యాదవ్ లు ప్రభుత్వాన్ని కోరారు. నరేష్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు ,
