Breaking News

కరాటేలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వేములవాడ విద్యార్థులు

127 Views

– మాస్టర్ మన్నాన్ శిక్షణతో విద్యార్థులు బ్లాక్ బెల్ట్స్ సాధించారు

వేములవాడ -జ్యోతి న్యూస్

వే ములవాడ పట్టణంలోని ఒకినావ మార్షల్ ఆర్ట్స్ అకాడెమీ కరాటే మాస్టర్ ఎంఏ మన్నాన్ శిక్షణలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్, కిడ్స్ కాన్వెంట్, హంసినీ డిజి స్కూల్, జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు కరాటేలో బ్లాక్ బెల్ట్స్ సాధించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ లో ఒకినావ మార్షల్ ఆర్ట్స్ అకాడెమీ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్, చీఫ్ ఎగ్జామినేర్ షిహాన్ కె. వసంత్ కుమార్ నిర్వహించిన బ్లాక్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో కొప్పు రోహిత్, సహజ, ఏనుగుల వర్షిత్, మహమ్మద్ అమీర్, హుస్సేన్ మహ్మద్, అఫ్సర్ లు బ్లాక్ బెల్ట్స్ సాధించారు. ఇందులో ఏనుగుల హరిహరన్ బ్రౌన్ బెల్ట్ సాధించాడు. ఈ గ్రేడింగ్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినిలకు ఎగ్జామినర్ షిహాన్ కె .వసంత్ కుమార్ బ్లాక్ బెల్ట్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. కాగా గత 6 సంవత్సరాల నుండి వేములవాడ పట్టణంలో పలు స్కూళ్లలో కరాటే మాస్టర్ మన్నాన్ ఆధ్వర్యంలో శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ లు, ప్రిన్సిపల్ లు నరాల దేవేందర్, సన్నిధి వెంకటకృష్ణ, దరక్షన్ వసిఫియా, నేరెళ్ల సంతోష్, గీతాదేవి హర్షం వ్యక్తం చేశారు. జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల, చందుర్తి మండలం లింగంపేట మహోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ ఏనుగుల కృష్ణ, ఇన్స్పెక్టర్లు తిరుపతి, కనకరపు రాజశేఖర్ లు విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇచ్చి, బ్లాక్ బెల్ట్స్ వచ్చేలా కృషిచేసిన మాస్టర్ ఎం ఏ మన్నాన్ ను పలువురు ప్రశంసించారు.

 

Oplus_131072
Oplus_131072
Anugula Krishna