మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్లు నిధులను సమర్ధవంతంగా నివారించాలని ప్రాజెక్ట్ అధికారిని సిడిపిఓ శిరీష అన్నారు. గురువారం మున్సిపాలిటీ కేంద్రంలోని ఐ సి డి ఎస్ కార్యాలయంలో మరిపెడ ప్రాజెక్ట్ పరిధిలోని 158 మంది అంగన్వాడి టీచర్లకు ప్రభుత్వం ద్వారా జారీ చేసిన స్మార్ట్ ఫోన్ లోనూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలకు ఇచ్చి పిల్లల,గర్భిణీలు, బాలింతలను ఆన్ లైన్లో సక్రమంగా చేయాలన్నారు. నిధుల పట్ల నిర్లక్ష్యం వటాస్తే సహ సహించేది లేదన్నారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లోనూ పంపిణీ చేసిందన్నారు. కావున అంగన్వాడి టీచర్లకు ఇచ్చిన స్మార్ట్ఫోన్లను ఇతర అవసరాలకు వాడకుండా అంగన్వాడి సెంటర్లో, పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు సేవల కొరకు మాత్రమే లేనియెడల కఠిన చర్యలు ఉంటాయన్నారు.ఈ కార్యక్రమానికి అంగన్వాడి టీచర్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు సంపూర్ణ, అంగన్వాడి టీచర్లు కారంపూడి శ్రీముతి, పద్మ, శ్రీలత, ఉమారాణి, రేణుక, కళావతి, మరిపెడ మండల పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్లు అందరూ తదితరులు పాల్గొన్నారు.
