ప్రాంతీయం

రైతు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

270 Views

కేంద్ర బిజెపి మోడీ ప్రభుత్వం రైతు ల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 12 వ తేదీ శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం ప్రక్కన నిర్వహించ తలపెట్టిన *రైతు ధర్నా* కార్యాక్రమాన్ని విజయవంతం చేయాలని ఎల్లారెడ్డిపేట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వరస కృష్ణాహారి కోరారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని రైతు సోదరులందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరశించాలని ఆయన పిలుపునిచ్చారు
అదేవిధంగా మండలంలోని టిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు రైతు సమన్వయ సమితి సభ్యులు అధ్యక్షులు ప్రతి గ్రామంలోని వివిధ గ్రామ శాఖలు టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరు ఈ కార్యక్రమానికి రైతులను పెద్ద ఎత్తున సమీకరించి ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండారి బాల్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట సింగిల్విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి .మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు అందె సుభాష్. మాజీ డైరెక్టర్ ఎలగందుల నర్సింలు. మాజీ ఎంపీటీసీ కమ్మరి శంకర్. సింగిల్ విండో డైరెక్టర్ సిరిపురం రాజిరెడ్డి.ఎస్సీ సెల్ మండల అద్యక్షులు ఎడ్ల సందీప్. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలగందుల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7