ఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం, పోచమ్మ తండా, నర్సింహుల గుట్ట తండా, బాకూరిపల్లి తండా, బొంగుల కింది తండా, తిమ్మాపూర్…… గంభీరావుపేట మండలం లోని సముద్ర లింగాపూర్ తండా, లక్ష్మీపూర్ తండా….. మరియు వీర్నపల్లి మండలం లోని మద్దిమల్ల తండా, లొద్ది తండా, కాశీ తండా, జవహర్ తండా ప్రాంతాలలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం.పి.ఆర్ .చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు.
ఈ దాడులలో 40 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసారు..
దీనికి బాధ్యులైనటువంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
అవగాహన కార్యక్రమాలు;
గుడుంబా సేవించడం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించడం జరిగింది. గుడుంబా తయారీ వల్ల పొయ్యి వేడికి ఆరోగ్యం పాడైపోతుందని గిరిజనులకు తెలియజేయండమైనది. గుడుంబా రవాణా చేయునపుడు వేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై మరియు గురి చేసి ఆదార పడ్డ వారిని అనాథలను చేయద్దనీ అవగాహన కార్యక్రమంలో ప్రజలకు మరియు గిరిజనులకు తెలియజేసారు.
ఈ దాడుల్లో .మరియు అవగాహన కార్యక్రమంలో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, ట్రైనీ ఎస్ఐలు శ్రీకాంత్, శేఖర్ లతో పాటు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు మరియు కానిస్టేబుల్స్ శంకర్, మధు, రాకేష్, సుజాత, రూప పాల్గొన్నారు.





