Breaking News ప్రాంతీయం

సఫాయి కార్మికులకు మద్దతు తెలిపిన బీసీ విద్యార్థి రాష్ట్రకోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్…

217 Views
      ముస్తాబాద్, ప్రతినిధి జూలై18, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని కెసిఆర్ ఇచ్చిన హామీలు విస్మరించడంతో గత13 రోజులుగా సఫాయి కార్మికులు దీక్ష చేస్తున్నారు. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ శిబిరంలో సమ్మె చేస్తున్న కార్మికుల సందర్శించి వారికి మద్దతుగా సంఘీభావం తెలిపారు. రవిగౌడ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు వాళ్ల డిమాండ్లను పరిష్కరించాలని ఈరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు గ్రామాలలో పరిశుభ్రత చేస్తూ గ్రామాలకు అవార్డులు తీసుకొస్తున్నారని అన్నారు. ఆనాడు కరోనా టైంలో కార్మికులు వారి ప్రాణాలను లెక్కచేయకుండా పరిశుభ్రత ధ్యేయంగా మలుచుకున్నారని గుర్తుచేశారు. బాడర్లో సిపాయి-ఊర్లో సఫాయి వీళ్లే లేకపోతే ప్రజలు లేరు గ్రామాలలో పరిశుభ్రత లోపిస్తుందని వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఈరాష్ట్ర ప్రభుత్వానికి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నావఘని అన్నారు. వారి జీతాలు 19000 పెంచాలని వారికి ఉద్యోగ భద్రత అందించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈరాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల టౌన్ అధ్యక్షులు రుద్రవీణ, సుజిత్ కుమార్, నాయకులు అనిల్ , రాము తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *