రాయపోల్ మండల కేంద్రంలోని రాయపోల్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో ముందస్తుగా గణిత సంబరాలలో భాగంగా రాయపోల్ మండల పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ప్రతిభ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపోల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ మాట్లాడుతూ విద్యార్థులు గణితాన్ని చూసి భయపడకుండా సాధన చేస్తే సులభతరమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి గణిత శ్రీరాములు, సలహాదారులు టి.రాములు, మండలంలోని వివిధ గణిత ఉపాధ్యాయులు రాజయ్య, గోవర్ధన్, తులసిదాస్, నరేందర్, లక్ష్మయ్య, సరిత, రజిత, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.




