ప్రాంతీయం

నిరుపేద వధువుకు పుస్తె మట్టెలు అందజేత

149 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని ఇందుప్రియల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పోతరాజు సత్తవ్వ లచ్చయ్య కుమార్తె మంజుల వివాహానికి ఎమ్మెన్నార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్ట్ డివిజన్ బాధ్యులు చందరాజు, పోతరాజు రవీందర్, తలారి నర్సింలు పుస్తెమట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజవర్గంలోని ఎమ్మెన్నార్ ట్రస్ట్ నిరుపేదలకు అండగా ఉంటుందని తెలిపారు. నియోజవర్గంలో పేదింటి ఆడపిల్లలకు మేనమామగా మద్దుల నాగేశ్వర్ రెడ్డి చేయూతనందిస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు స్వామి, శ్రీనివాస్, రాజు, లచ్చయ్య, రామస్వామి, మమత తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found