ప్రాంతీయం

అంతర్ జిల్లా దొంగఅరెస్టు రిమాండ్ కు తరలింపు…

194 Views

  ముస్తాబాద్, ప్రతినిధి జూలై 11, మండల కేంద్రంలో ఈనెల 9వ తేదీన దుబ్బాక రోడ్డులో  మసీదు వద్ద ఓఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో చొరబడడానికి యత్తించిన దుబ్బాకకు చెందిన మహమ్మద్ రఫీకును ముస్తాబాద్ శివారులో అరెస్టు చేశారు. ఎస్సైవెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక చెందిన రఫిక్ వెల్డింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. వచ్చే జీతం సరిపడపోగ జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని దొంగతనాలు పాల్పడుతున్నాడు. తాళాలు వేసిన ఇంటికి కన్నంవేసి దొంగతనాలు చేస్తుండేవాడు ఈనెల 9వ తేదీన ముస్తాబాద్ లో మందాటి మల్లయ్య యాదవ్ ఇంటిడోరుకున్న తాళం పగులకొట్టి చొరబడడానికి యత్నించాడు ఆసమయంలోఇంటి యజమానులు రావడంతో అక్కడి నుండి పారిపోయాడు ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా మంగళవారం సాయంత్రం ముస్తాబాద్ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న రఫీకును అదుపులో తీసుకొని విచారిస్తుండగా ఫింగర్ ప్రింట్ ఆధారంగా గతంలో నేరస్తుడని తెలిసింది దీంతో అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ పంపినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *