చందుర్తి –
జ్యోతి న్యూస్
చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఒగ్గుడోలు శిక్షణ కేంద్రాన్ని చందుర్తి జడ్పిటిసి సభ్యులు నాగం కుమార్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ జోగాపూర్ గ్రామానికి చెందిన యువకులు కుల దైవమైన బీరప్ప ఉత్సవాల్లో ఒగ్గుడోలు చేయు సందర్భంగా ఒగ్గు డోలు పై ఆసక్తి చూపటం అభినందనీయమన్నారు. ఒగ్గుడోలు శిక్షణ తీసుకుంటున్న కళాకారులకు ప్రభుత్వ చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్లాలన్నారు. జోగాపూర్ గ్రామానికి చెందిన యువకులు స్వచ్ఛందంగా ఒగ్గు డోలు నేర్చుకొనడం మంచి కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి మ్యాకల గణేష్. సింగిల్ విండో డైరెక్టర్ నాగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు,