ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామము లో సర్పంచ్ కుంబాల వజ్రమ్మ చేతుల మీదుగా తాళ్లపల్లి మంజుల 1,00,116 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కును ఆదివారం రోజున లబ్ధిదారురాలి ఇంటి వద్ద ఇచ్చారు.ఈ సందర్బంగా వజ్రమ్మ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాలకు వరమని, ఆడపిల్లల పెళ్లిళ్లకు 1,00,116 రూపాయలు ఇవ్వడం చాల సంతోషకరమన్నారు.కళ్యాణ లక్ష్మి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ఐటీ మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారుకార్యక్రమంలో ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం,ఉప
సర్పంచ్ సుదమల్ల సురేందర్, గ్రామశాఖ అధ్యక్షులు కుంబాల లక్ష్మారెడ్డి,నాయకులూ గున్నాల వెంకటస్వామి గౌడ్,కామీడి శ్రీకాంత్,తాళ్లపల్లి మల్లేశం,గుల్లపల్లి మల్లారెడ్డి,ఉప్పుల భారతి,తాళ్లపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు
