కోనరావుపేట , మెట్రో న్యూస్ : ప్రజలలో పుస్తక పఠనాసక్తి పెంపొందించడం కోసం కోనరావుపేట మండల కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభించిన పౌర పఠన మందిరం నిర్వహణ పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ప్రజలతో పాటు విద్యార్థులు, యువతీ యువకులకు పుస్తకాల పట్ల ఆసక్తి పెంచేలా పౌర పఠన మందిరాన్ని (రీడింగ్ రూమ్ ) ఏర్పాటు చేశారు. అయితే నిత్యం మూసి ఉంచడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి పఠన మందిరం నిత్యం అందుబాటులో ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
