తంగళ్ళపల్లి మండలం పద్మా నగర్ గ్రామంలో శుక్రవారం ముఖ్య నాయకులతో ప్రత్యక సమావేశం నిర్వహించడం జరిగింది మండల ఇంచార్జ్ గుండు ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు లింగంపల్లి మధుకర్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల త్యాగ ఫలాలను ప్రజలందరి దరిచేర్చే ఏకైక నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని బలపరిచేందుకు బహుజన్ సమాజ్ పార్టీని ప్రతి ఓటర్ దగ్గరికి తీసుకెళ్లాలని లింగంపల్లి మధుకర్ పిలుపునిచ్చారుబహుజన వర్గాలు రాజ్యాధికారానికి చేరకుండా కుయుక్తులు పన్నుతున్న బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ కు రానున్న ఎన్నికలలో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు మెర్గు రాజు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తడక భాను ఉపాధ్యక్షులు, చిట్టిపెళ్లి నరేందర్ , తంగళ్ళపల్లి మండల కార్యనిర్వాహక కమిటీ సభ్యులు వంతడ్పుల కిషన్ , సగ్గుపాటి శంకర్ , మెరుగు భాస్కర్, వెలగొండ కృష్ణ మరియు తదితరులు నాయకులు తదితరులు పాల్గొనారు.
