బెస్ట్ అవైలబుల్ స్కూలుగా ఎంపికైన విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్:
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ బెస్ట్ అవైలబుల్ స్కూలుగా ఎంపిక కావడం జరిగిందని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ మహమ్మద్ లతీఫ్ తెలిపారు ఈ సందర్భంగా లతీఫ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏడు పాఠశాలలకు 2023 – 24 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలగా ఎంపిక కావడం జరిగిందన్నారు,పాఠశాలలో ఒకటవ తరగతి విద్య కోసం ఆంగ్ల మాధ్యమంలో ఉచితంగా విద్యను అందించడం జరుగుతుందన్నారు ,
షెడ్యూల్ కులాలకు చెందిన ఒకటవ తరగతి విద్యార్థులకు మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు దరఖాస్తు చేసుకునేవారు ఆదాయం 1,50,000 లోపు ఉండాలని కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం కల్పించడం జరుగుతుందని జిల్లాకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు, కులము ఆదాయం కు సంబంధించిన తప్పుడు సమాచారం అందిస్తే చర్యలు ఉంటాయన్నారు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 15వ తేదీ చివరి తేదీని నిర్ణయించిందన్నారు, జూన్ 1, 2017 నుండి మే 31 , 2018 మధ్యలో పుట్టిన చిన్నారులు మాత్రమే అర్హులు అన్నారు, బాలురు బాలికలకు ప్రవేశం కల్పించబడుతుందన్నారు దరఖా చేసుకునేవారు జిరాక్స్ సెంటర్లలో దరఖాస్తూ ఫారం తీసుకుని రెండు ఫోటోలు కులం ఆదాయం ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్లను జతపరిచి ఈ నెల 15 లోపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని షెడ్యూల్ కులాల కార్యాలయంలో అందించాలన్నారు
