ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూలై 5, మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పాఠశాల సందర్శించి పనులను పరిశీలించారు. ఈసందర్భంగా బదనకల్ పాఠశాలలో నీటి కొరత ఎక్కువగా ఉన్నందున పాఠశాలకు ఒక బోర్ వేయించాలని పాఠశాల ఎస్ఎంసి చైర్మన్లు కస్తూరి శ్రీనివాస్ రెడ్డి, చిగురు నరేష్ విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ ని కోరగా వెంటనే స్పందించిన కలెక్టర్ ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పిటిసి గుండం నరసయ్య లకు తెలుపగా ఈరోజు ఎంపీపీ శరత్ రావు చొరవతో బోరుబావి మొదలుపెట్టారు. ఆ బోరు ద్వారా పాఠశాలకు సరిపడ నీరు కూడా వచ్చాయి. ఎంపీపీ శరత్ రావు, జెడ్పిటిసి గుండం నరసయ్య, ప్రజా ప్రతినిధులకు మరియు ఎంపీపీ ఎస్ జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు, అభివృద్ధి అధికారి రమాదేవి, తాసిల్దార్ మునీందర్, తదితర అధికారులకు మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలిపారు.
