ప్రాంతీయం

దళిత బంధు దేశానికి ఆదర్శం మంత్రి కేటీఆర్

84 Views

ప్రభుత్వం చిన్న వ్యాపారులకుచేయూతనిస్తుందిమంత్రులు శ్రీ కేటీఆర్,శ్రీ కొప్పుల ఈశ్వర్వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ

128మంది చిన్న వ్యాపారులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేత

తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ళ వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్ రామ్ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి,నివాళులు అర్పించారు.అనంతరం సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయం సముదాయం ఆవరణలో దళిత బంధు పథకం క్రింద రెండు మునిసిపల్ సెప్టిక్ ట్యాంక్, బస్సు యూనిట్ లను వాహనాలను ప్రారంభించారు.అనంతరం idoc కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో చిన్న తరహా వ్యాపారులు 128 మంది ఎస్సీ లబ్ధిదారులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ కుటీర వ్యాపార పథకం క్రింద 128 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు.సీఎం కేసిఆర్ నాయకత్వంలో దేశంలొ ఎక్కడా లేని విధంగా దళితులను ధనికులు గా చేసేందుకు దళిత బంధు కార్యక్రమం చేపట్టారన్నారు.దళిత బంధు పథకం ఫలితాలు అందుతుంటే సంతోషం వేస్తుందన్నారు.రెండో విడతలో నియోజకవర్గంకు 1100 చొప్పున యూనిట్ లు పంపిణీ చేస్తామన్నారు.దళిత సమాజంలో పరివర్తన కృషి చేస్తున్నామని,దళిత బంధు మొదటి విడతలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుస్థిర జీవనోపాధి లబ్ధిదారులు పొందేలా యూనిట్ లను మంజూరు చేశామన్నారు.సంపద సృష్టించే లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో దళిత బంధు యూనిట్ ల గ్రౌండింగ్ చేశామని చెప్పారు. ఇందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పారు.మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణాన్ని రూపురేఖలు మార్చి,అభివృద్ధి అంటే ఇట్లా ఉంటాడని చూపిన వ్యక్తి మంత్రి కేటీఆర్ అని కొనియాడారు.ముఖ్యమంత్రి అన్ని వర్గాలు బాగుండాలని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని,సంక్షేమ పథకాలలో దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నదన్నారు.వ్యవసాయం,విద్య,వైద్యం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని,దళితులు దళిత బంధు ద్వారా ధనికులు అయ్యారన్నారు. ఇప్పటి వరకూ 40వేల మందికి దళిత బందు పథకం క్రింద యూనిట్ లు గ్రౌండ్ అయ్యాయని చెప్పారు. వీటిలో 98 శాతం యూనిట్ లు సక్సెస్ అయ్యాయని చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా 15లక్షల మంది దళిత కుటుంబాలకు దశల వారీగా దళిత బంధు వస్తదని అన్నారు..75 సంవత్సరాలలో దళితులను పట్టించుకున్న నాథుడే లేడని,తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులలో చైతన్యం వచ్చిందని,ఎస్సీ కార్పొరేషన్ లోన్ లలో 60 శాతం సబ్సిడీ ఇచ్చిన ఘనత కెసిఆర్ దేనన్నారు.చిన్న వ్యాపారులను ఆదుకోవాలని 50వేల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని,దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ అరుణ,వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు,రాష్ట్ర టెక్స్టైల్,పవర్లూం చైర్మెన్ ప్రవీణ్,సెస్ చైర్మెన్ రామారావు,గ్రంధాలయ శాఖ చైర్మెన్ శంకరయ్య,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నర్సయ్య,సిరిసిల్ల,వేములవాడ మున్సిపల్ చైర్మన్లు కళ,మాధవి,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్,ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *