ప్రాంతీయం

విద్యాదినోత్సవ వేడుకలలో పాఠ్యపుస్తకాలు నోట్ బుక్కుల పంపిణీ…

221 Views

ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 20, విద్యా దినోత్సవ వేడుకలులో భాగంగా ర్యాలీ గ్రామ వీధులగుండా నిర్వహించారు. అనంతరం ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రధానోపాధ్యాయులు పతాకావిష్కరణ గావించారు. విద్యార్థులకు మండల ఎంపీపీ జనగామ శరత్ రావు చేతులమీదుగా డిజిటల్ క్లాసులులో భాగంగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్ పి) -స్మార్ట్ టీవీని ఆరంభించారు. అదేవిధంగా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా విద్యార్థులకు ఉచిత దుస్తులు, ఉచిత పాఠ్య పుస్తకములు, నోటుబుక్ లు పంపిణీ చేశారు. సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సహితం ప్రభుత్వం అనేక మౌళిక సదుపాయాలు కల్పిస్తుందని విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు ఉచిత దుస్తులు ఈసారి ఉచిత నోటుబుక్ లు ఇంకా అనేక అవసరాలను ప్రభుత్వమే నెరవేరుస్తున్నందున విద్యార్థులు చాలా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి గుండం నర్సయ్య, సర్పంచ్ గాండ్ల సుమతి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఎంపిటిసి కంచం మంజుల నర్సింలు, మండల కో-ఆప్షన్ షాదుల్ పాప, ఏఎంసి చైర్మన్ అరుట్ల రాజిరెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ యాగండ్ల సంగీత, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రవీందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *