140 Views
ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి
జూన్ 4, ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సర్పంచ్ కల్వకుంట్ల వనజ ఆధ్వర్యంలో ఒక స్తంభం నుండి మరొక స్తంభం మధ్యలోవేలాడుతున్న విద్యుత్ వైర్లు ప్రమాదపు అంచున ఉన్నావని దాన్ని గమనించిన గ్రామస్తులు ప్రజా ప్రతినిధులకు తెలుపగా వాటిని సవరించి పసుపు కుంకుమతో పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి నూతన స్తంభాన్ని వేశారు. ఈకార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు ,ప్యాక్స్ డైరెక్టర్ కట్ట బాపురావు, బి ఆర్ ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు నరాయనోజు సతీష్ , గ్రామ పెద్దలు రిక్కల లింగారెడ్డి, జంపెల్లి దేవయ్య ,రైతులు శీలం నర్సింలు, కుమ్మరి బాలయ్య, ఎడ్ల మారుతి, బిట్ల రాజయ్య, మంద భిక్షపతి సెస్ సిబ్బంది శ్రీనివాస్, రమేష్ శ్రీ శైలం తదితరులు పాల్గొన్నారు.

