ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 4, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో1996-1997 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు. 26సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకొని వారికి విద్య బోధలు నేర్పించిన గురువులతో కలిసి విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆయా వృత్తులలో స్థిరపడిన పూర్వవిద్యార్థులు తమగత స్మృతులను గుర్తుచేసుకుంటూ తమ వయస్సును మరచి నృత్యాలు చేస్తూ ఆటలాడుతూ కోలాటం ఆడుతూ పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు. తాను చదువుకున్న పాఠశాలలో కలిసి తిరిగి పూర్వ అనుభవాలను స్మరించుకున్నారు. తమకుటుంబ నేపద్యాలను కష్టసుఖాలను పంచుకున్నారు. పూర్వవిద్యార్థులలో ఆరోగ్యపరంగా ఇబ్బందులలో ఉన్న బీదరికంలో ఉన్న సహాయ సహకారాలను అందించాలని తీర్మానించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయిలో గౌరవం పొందినప్పుడే పూర్తి
గుర్తింపు లభిస్తుందని విద్యార్థుల ఉన్నత తెలుపుతుంటే చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి మెమొంటోళ్లు అందజేశారు. ఈకార్యక్రమంలో విద్యార్థులు అబ్రమేని దేవేందర్, కంచంనర్సింలు, బాల్ నర్సు, రాజు, శంకర్, మహేష్ ,అమృతరావు, మంజుల, జ్యోతి, యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




