297 Views
ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 4, హైదరాబాద్, యూసుఫ్ గూడలో ఆదివారం (04.06.2023) నాడు అసంఘటితరంగ కార్మికులకు సామాజిక భద్రత అనే అంశంపై చర్చ జరిగింది. ఈకార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బిఎంఎస్ జాతీయ నాయకులు బి. సురేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసంఘటితరంగ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వుమ్మన్నగారి దేవేందర్ రెడ్డితో గల్ఫ్ కార్మిక నాయకులు తోట ధర్మేందర్, స్వదేశ్ పరికిపండ్ల గల్ఫ్ కార్మికుల సంక్షేమం గురించి చర్చించారు. సమగ్ర ఎన్నారై పాలసీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు ఆవశ్యకత గురించి త్వరలో సంబంధిత అధికారులతో, మంత్రులతో సమావేశానికి దేవేందర్ రెడ్డి హామీ ఇచ్చారని తోట ధర్మేందర్ పేర్కొన్నారు.
రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?




