సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి .ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 19వ వార్డుకు చెందిన త్రిపురేశ్వర్ అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సను చేయించుకోవడం జరిగింది, నిరుపేద అయిన బాధితుడు త్రిపురేశ్వర్ సీఎం రిలీఫ్ ఫండ్ కు అప్లై చేసుకోవడం వలన ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 60 వేల రూపాయలు చెక్కు మంజూరు కావడం జరిగింది . సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును త్రిపురేశ్వర్ కు గజ్వేల్ సీఎం క్యాంపు కార్యాలయం లో స్థానిక కౌన్సిలర్ గుంటుకు శిరీష రాజుతో కలిసి చెక్కును అందజేసిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు సంజీవనీ అన్నారు, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్న వారికి ఆపద్బంధు లాంటిది అన్నారు, ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బబ్బురి రజిత, అత్తిలి శ్రీనివాస్, సమీర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మతిన్, సీనియర్ నాయకులు నరసింగరావు, తోట శ్రీనివాస్, తదితరులున్నారు..