ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 23, ముస్తాబాద్ మండలం మద్దికుంట మోయినికుంట రైతు వేదికలో ఆయిల్ ఫామ్స్ సాగుపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. రైతులు వెయ్యి రూపాయల డిడితో 90.శాతం రాయితీపై ఎగరానికి 50,మొక్కలు చొప్పున అందజేయుటకు అలాగే డ్రిప్ సబ్సిడీ ఎస్సీ, ఎస్టీ రైతులకు 100.శాతం బీసీ రైతులకు 90.శాతం జనరల్ రైతులకు 80.శాతం ఇవ్వబడునని అన్నారు. అదేవిధంగా మొదటి నాలుగు సంవత్సరాలకు నిర్వహణ కింద అంతర పంటలు వేయడానికి ఎకరానికి 4200. చొప్పున పెట్టుబడులకు సహకరించబడునని అన్నారు. అలాగే ఆయిల్ ఫామ్ సాగుపై రైతులతో చర్చలు జరిపారు. ఈకార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు. సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, ఏఈవొ రేవతి, గ్రామ కోఆర్డినేటర్ ఇల్లందుల నారాయణ, ఉపసర్పంచ్ కదిరే భూమయ్య, రైతులు కరణాల అనిల్, జనగామ గోపాల్ రావు, ఆయిల్ ఫామ్ కంపెనీ కష్టం ఆఫీసర్ ప్రేమ్ సాయి లు పాల్గొన్నారు.
