-కాలాన్ని పెట్టుబడిగా వాడుకోవాలి
-జీవితంలో మార్పు కావాలంటే ఓర్పు కావాలి
దౌల్తాబాద్: బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు రావాలంటే విద్యను ఆయుధంగా నమ్ముకొని ముందుకు సాగాలని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ పేర్కొన్నారు.శుక్రవారం దౌల్తాబాద్ మండలం శౌరిపూర్ గ్రామానికి చెందిన చెన్న రాజు ఇటీవల వెలువడిన గురుకుల ఉపాధ్యాయ నియామకాలలో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. ఆయనను ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేదరికం జయించడానికి విద్య ఆయుధంగా వాడుకోవడం ద్వారా ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. డబ్బులు పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేయలేని వారు కాలాన్ని పెట్టుబడిగా పట్టుదలతో విద్యాపైకి మళ్లీస్తే తప్పకుండ మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఒక్క రోజుతో జీవితంలో మార్పు సాధ్యం కాదని ఓపికగా ముందుకు సాగితే జీవితంలో మార్పు అదే వస్తుందని పిలుపునిచ్చారు. మారుమూల గ్రామంలో చదువు కొనసాగించిన పట్టుదలతో ఉద్యోగం సాధించిన చెన్న రాజును యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. విద్యా ద్వారానే అంబేద్కర్ ప్రపంచ మేధావిగా పేరు పొందడని, ఆయన నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. సమసమాజ నిర్మాణం కోసం విద్యా పునాదిగా ఉపయోగ పడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, రాయపోల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు,ఎస్ ఆర్ ఫౌండేషన్ కోశాధికారి మహమ్మద్ ఉమర్, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




