ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 23, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ఈరోజు బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్సై శ్రీకాంత్ గౌడ్ మరియు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ సిరిసిల్ల బస్ స్టేషన్ లో ఆర్టీసీ కార్మికులకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ చేశారు అనంతరం రవిగౌడ్ మాట్లాడుతూ తీవ్రమైన ఎండలో ఆర్టీసీ కార్మికులు ప్రయాణికులకు తమ తమ గమ్యాలకు చేరుతున్నారని ఈఎండ వలన కొంచెం ఉపశమనం కోసం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల టౌన్ ఎస్సై శ్రీకాంత్ గౌడ్ రావటం సంతోషమని అన్నారు ఆర్టీసీ ఉద్యోగులకు పోలీస్ శాఖవారు సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎస్సై శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు బీసీ విద్యార్థి సంఘంని రవి గౌడ్ ను మునుముందు మరిన్ని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇన్చార్జ్ ఇల్లందుల ప్రకాష్, మరియు ఆర్టీసీ STI సారయ్య కంట్రోలర్ రామ్ రెడ్డి, డ్రైవర్లు, కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
