ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే18, బంధనకల్ గ్రామంలో ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతులను గురువారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కిశోర కుట్టు శిక్షణకేంద్రం ప్రారంభించారు. ఈకార్యక్రమం నెలరోజులపాటు ఉదయం 9,గం.నుండి 11,గం.వరకు నిర్వహించునని తెలిపారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ అరవింద మాట్లాడుతూ బాలికలకు వృత్తి శిక్షణ కోర్సులను కుటుంబ పోషణకు అనుగుణంగా భవిష్యత్తులో బాగుపడతారన్నారు. బాలికలు స్వశక్తితో ఎదిగేందుకు ఐసిడిఎస్ కేంద్రం ద్వారా వృత్తి శిక్షణ సక్రమంగా హాజరైతేనే పూర్తి స్థాయిలో వృత్తి శిక్షణ కోర్సుల్లో నైపుణ్యం సంపాదించ వచ్చన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వరి నారాగౌడ్ ఎంపిటిసి రామచంద్రారెడ్డి, కుట్టు మిషన్ ట్రైనర్ జంగం పరమేశ్వరి, అంగన్వాడి నిర్వహితులు భారతి, బుచ్చమ్మ, భారతీదేవి, విమల, చంద్రకాంత, జోష్ణ తదితరులు పాల్గొన్నారు.
