ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం టి ఎస్ ఆర్ టి సి సిరిసిల్ల డిపో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్గో సెంటర్ ను అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట ఉప సర్పంచ్ ఒగ్గు రజిత ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడారు. ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కౌంటర్ పని చేయు వేళలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మీ పార్సిల్ లను బుక్ చేసుకోవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీనివాస్ రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లు రాజు ఎస్ఎస్ గౌడ్ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శేఖర్ మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్ ఎల్లారెడ్డిపేట ఏజెంట్ దీటి నర్సయ్య ,దీటి దేవేందర్,బి ఆర్ ఎస్ నాయకులు అఫ్జల్ పాల్గొన్నారు.. ఇతర సమాచారం కోసం 8466962653 , 9154298576 ధీటి నర్సయ్య సంప్రదించాలన్నారు
