ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే18, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు వెంటనే లక్షరూపాయల రుణమాఫీచేసి పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద కెసిఆర్, కేటీఆర్ ఫ్లెక్సీఫోటో దహనం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 2018లో ఎన్నికల సందర్భంగా రైతులకు లక్షరూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు రుణమాపి చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. అకాల వర్షానికి పంటనష్టపోయిన రైతుల
వద్దకువెళ్లి పర్యావేక్షించి నష్టపోయిన రైతులకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాననిచెప్పి ఇంతవరకు మాటలకే పరిమితం అయిందన్నారు. తెలంగాణ రైతులకు రుణమాఫీ నష్టపరిహారం దిక్కులేదు కానీ పంజాబ్ రైతులకు మనడబ్బును పంచి పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఇప్పటికైనా ప్రజలు రైతులు యువకులు మేల్కొని విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిలు కొండం రాజిరెడ్డి, శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రాములుగౌడ్, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, కొప్పు రమేష్, అనమేని రాజు, గన్నెబాను, ముద్దం రాజు, దీటి నర్సింలు, వేముల సత్యంగౌడ్, మాజీ సర్పంచ్ తిరుపతి, ఆగుల్ల రాజేశం, ఆరుట్ల మహేష్ రెడ్డి, ఉచ్చిడి బాల్ రెడ్డి, వంగ మోహన్ రెడ్డి, క్యారమ్ రాజు, కమ్మరి శ్రీనివాస్, జంగిడి బాలరాజు, రామచంద్రం, నారాయణరెడ్డి, రంజాన్ నరేష్, తాళ్ల విజయ్ రెడ్డి, శీల ప్రశాంత్, మిడిదొడ్డి భాను, సారుగు రాకేష్, సద్ది మధు, మెరుగు శివ గౌడ్, మచ్చ కొండయ్య, మద్దికుంట రాజం, దాప మహేష్, నవీన్, ప్రవీణ్, ప్రశాంత్, తరుణ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.




