ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 24, సిరిసిల్ల బిసి భవన్ లో బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ అధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిధిగా బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ హాజరై ఆయన మాట్లాడుతూ కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బిసిలను చిన్నచూపు చూస్తున్నది అన్నారు. బిసి కులజనగణనను వెంటనే రాష్టలో చేపట్టాలని అని డిమాండ్ చేశారు. బిసిబిడ్డ దేశ ప్రధానిగా వుండి బిసి కులజనగణన చెయ్యకపోవడం బాధాకరంమన్నారు, దేశ వ్యాప్తంగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ న్యాయకత్వంలో బిసి కుల జనగణన కోసం అన్ని పార్టీలతో అన్ని రాష్టలలో ఆందోళన కార్యక్రమాలు చేస్తాంమని హెచ్చరించారు. రాష్ట్రలో అన్ని పార్టీ లను కలుపుకొని మరింత ఉదృతం చేస్తాంమని రానున్న రోజుల్లో బిసీల సత్తాఏంటో చూపిస్తాంమని రాష్ట్ర ప్రభుత్వం బిసి కుల జనగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కుల జనగణన కోసం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టాలని ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్, బిసి హాస్టల్ ఇంచార్జీ నవీన్, పట్టణ అధ్యక్షులు రుద్రవేని సుజాత, నాయకులు తరుణ్, రాహుల్, పవన్, విజయ్, వినాయక్, కార్తీక్, మణికంఠ, మనోజ్,పానవ్, లోకేష్, సాయి ప్రితం తదితరులు పాల్గొన్నారు.
