వైఎస్సార్ తెలంగాణ పార్టీ ములుగు మండల ప్రధానకార్యర్శి గా పల్లె ఆనంద్ ముదిరాజ్
గజ్వేల్ నియోజకవర్గం లో రోజు రోజుకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ లో ఇతర పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు వైఎస్సార్ తెలంగాణ పార్టీ లో చేరుతున్నారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గజ్వేల్ నియోజకవర్గం అసెంబ్లీ కో ఆర్డినేటర్ మేదిని రామలింగారెడ్డి అధ్వర్యంలో ములుగు మండలం నుండి పల్లె ఆనంద్ ను వైఎస్సార్ తెలంగాణ పార్టీ ములుగు మండల ప్రధాన కార్యదర్శి గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు పల్లె ఆనంద్ మాట్లాడుతూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ నీ ముందుకు తీసుకెళ్లడానికి ఎల్లవేళలా తనవంతు కృషి చేస్తానని అన్నారు తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షులు మేదిని రామలింగారెడ్డి అభినందనలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి రాగుల నాగరాజు. జిల్లా షోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి శెట్టి బిక్షపతి ముదిరాజ్. ములుగు మండల అధ్యక్షుడు గామిడి నరేందర్ రెడ్డి. తదితరులు నాయకులు పలుగొన్నరు
