ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 17, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బిసి స్టడీ సర్కిల్ లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకి కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులకు ఎండాకాలంలో చల్లదనం కోసం మజ్జిగను బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ అందజేశారు, అనంతరం కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం తరఫునుండి వెనుకబడిన విద్యార్థులకు ఉచిత కోచింగ్ సదుపాయం అందరూ వినియోగంపరచుకొని శ్రద్ధతో చదువుకొని వెనుకబడిన తరగతుల నుండి చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగాలను పొంది సామాజిక వర్గానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థిని విద్యార్థులకు పలు సూచనలను అందించారు. బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల జిల్లాకి రావడానికి బీసీ విద్యార్థి సంఘం నుండి చాలా వరకు కృషి చేశామని. బీసీ స్టడీ సర్కిల్ ని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మన సిరిసిల్ల మంత్రి కేటీఆర్ చోరువ తీసుకొని మంజూరు చేసి మంచి అధ్యాపకులను అందిస్తున్నారు. ఇప్పుడు దాదాపు బీసీ స్టడీ సర్కిల్లో ఉన్న అందరూ విద్యార్థిని విద్యార్థులు కూడా జరగబోయే గ్రూప్స్ పరీక్షలకి హాజరై ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. అనంతరం బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్లావెంకటస్వామి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ ను అభినందించారు. ఈకార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి, పట్టణ అధ్యక్షులు రుద్రవేణి సుజిత్ కుమార్, బిసి స్టడీ సర్కిల్ స్టాఫ్ , విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు.
