ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్7, రుణమాఫీ డబ్బుల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన గడువు ముగిసినప్పటికీ రుణ మాఫీ కాకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వం మొదట సెప్టెంబరు 15వ తేదీలోపు రుణాలు మాఫీ అవుతాయని ప్రకటించింది. మళ్లీ 30వ తేదీకల్లా రుణమాఫీ పొందిన రైతులందరికి మాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ జిల్లాలో సగంమంది రైతుల ఖాతాల్లో నేటికీ డబ్బులు జమకాలేదు.
రుణమాఫీ కోసం ఎదురుచూపులు
అక్టోబరు 5: రుణమాఫీ డబ్బుల కోసం అన్నదాతలు ఎదు రు చూస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన గడువు ముగిసినప్పటికీ రుణ మాఫీ కాకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వం మొదట సెప్టెంబరు 15వ తేదీలోపు రుణాలు మాఫీ అవుతాయని ప్రక టించింది. మళ్లీ 30వ తేదీకల్లా రుణమాఫీ పొందిన రైతులందరికి మాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ జిల్లాలో సగంమంది రైతుల ఖాతాల్లో నేటికీ డబ్బులు జమ కాలేదు. రోజు రైతులు తమపనులు వదులుకుని బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొంటుంది. అంతే కాకుండా రుణమాఫీ రైతులకు అసెంబ్లీ ఎన్నికల కోడ్ భయం వెంటాడుతోంది. ఎన్నిక ప్రవర్త నియామవళి అమలులోకి వస్తేతమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు.
2018లో జిల్లా వ్యాప్తంగా 92 వేలమంది రైతులకు వివిధ బ్యాంకుల ద్వారా రూ.365 కోట్ల వ్యవసాయ రుణాలు అందించారు. వీరిలో ఇప్పటి వరకు అర్హులైన 44 వేల మందికి రుణమాఫీ కింద రూ.230 కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మరో 48 వేల మంది రైతులకు రూ.230 కోట్లు జమ చేయాల్సి ఉంది. రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమకాకపోవడంతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రోజు వ్యవసాయ పనులు మానుకుని రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకు అధికారులు సైతం నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-అయోమయంలో అన్నదాతలు
- ప్రభుత్వం మొదట సెప్టెంబరు 15లోపు రైతులకు రుణమాఫీ అవు తుందని ప్రకటించింది. అనంతరం 30లోపు మాఫీ అవుతాయని మరో సారి తెలిపింది. సెప్టెంబరు నెలపూర్తయినా సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని లెక్కలు చూస్తే అర్ధమవుతోంది. రైతుల రుణాలు ప్రభుత్వం ఏ ప్రాతిపాదికన మాఫీ చేస్తుందో అర్థంకాని పరిస్థితి రైతులు, బ్యాంకు అధికారుల్లో నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు రుణాలు సమానంగా ఉన్నా ఒకరికి మాఫీ అయితే ఒకరికి కాలేదు. ఒక రైతు లక్ష రూపాయలు మాఫీ అయితే, మరో రైతుకు రూ. 50 వేలలోపు రుణంఉన్నా మాఫీకాని పరిస్థితి ఉంది. కొందరు రైతులు బంగారం తాకట్టుపై పంట రుణాలు తీసుకుంటున్నారు. వీటిపై ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ఒకే కుటుంబంలో ఒకే ఆధార్ నంబరుతో అనేక మంది పంట రుణాలు తీసుకున్నారు. వీరి విషయంలో సైతం ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక కుటుంబంలో ఎంతమంది రుణంతీసుకున్నా ఒక్కరికే రుణమాఫీ వస్తుంది కాబట్టి ఆ ఒక్కరు ఎవరనే దాని గురించి ప్రక్రియ ఇంతవరకు మొదలుకాలేదు. అర్హులైన రైతులకు రుణమాఫీ చేసే ప్రక్రియ చేసిన్పటికీ క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. సమస్యలు పరిష్కరించి త్వరగా రుణమాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు.
లేనిపక్షాన రైతులందరం కలిసి ఈ ప్రభుత్వానికి బుద్ధిచెబుతాం అలాగే తక్షణమే రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని మునుముందు రైతుల చేత అనేక కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. వరి వెంకటేష్ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు.
